After a fan breached security to meet his idol MS Dhoni, former Indian skipper Sunil Gavaskar had a funny take on how he managed to dodge security officials in Nagpur.
#IndiaVsAustralia2019
#indvsaus2ndODI
#MSDhoni
#Gavaskar
#Hayden
#ViratKohli
#vijayshankar
#mohammedshami
#ambatirayudu
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో కరచాలనం కోసం ఓ అభిమాని వెంటపడిన సంగతి తెలిసిందే. భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ చేయడానికి జట్టు సభ్యులు మైదానంలోకి వెళుతున్న సమయంలో ధోనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు అభిమాని యత్నించాడు. అయితే అభిమాని నుంచి తప్పించుకునేందుకు ధోని మైదానంలో పరుగులు తీశాడు.ఆ అభిమాని సైతం ధోనిని వదలకుండా పరుగు తీశాడు. చివరకు ఎంతకూ ఆ అభిమాని వదలకపోవడం ధోని వికెట్ల వద్ద నిలబడిపోయాడు. దీంతో ధోనిని అభిమాని గట్టిగా ఆలింగనం చేసుకుని ఆనందంతో మురిసిపోయాడు. ఈ ఘటనపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మండిపడగా.. సునీల్ గవాస్కర్ మాత్రం సరదాగా స్పందించాడు.